మెగా ఫ్యామిలీతో నాగ్‌ సంక్రాంతి సంబరాలు..

36
chiru

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా ఒక్క‌చోట చేరి సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటార‌ని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నిర్వ‌హించిన వేడుక‌లో మెగా కుటుంబ స‌భ్యుల‌తో పాటు అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. వారంద‌రూ దిగిన గ్రూప్ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. ఇందులో చిరంజీవితో పాటు నాగార్జున, రామ్ చ‌ర‌ణ్, అల్లు శిరీష్, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్ ప‌లువురు ఉన్నారు.

స్టైలిష్ దుస్తుల‌తో వారు క‌న‌ప‌డుతున్న తీరు అల‌రిస్తోంది. యంగ్ హీరోల‌కు పోటీనిస్తూ చిరంజీవి, నాగ్ మ‌రింత యంగ్ గా క‌న‌ప‌డుతున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వేడుక‌లో హైద‌రాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ క‌చేరి కూడా చేసింద‌ని తెలుస్తోంది. పండుగ సంద‌ర్భంగా మెగా కుటుంబ స‌భ్యులంతా క‌లిసి భోజ‌నం చేశారు.