చిరుకి నాగ్ కి తేడా ఏంటి?

232
Chiranjeevi host MEK
- Advertisement -

కౌన్ బనేగా కరోడ్ పతి.. బుల్లితెరపై మెగా హిట్ షో. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో ఈ షో మొదలైంది. ఆయన ఈ షో గ్లామర్ ను వందరెట్లు పెంచారు. ఆ తరువాత ఈ షో చాలా ప్రాంతీయ భాషల్లోకి వెళ్ళింది. అయితే ఎక్కడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అయితే తెలుగులో మాత్రం సక్సెస్ అయ్యింది. అందుకు కారణం నాగార్జునేనని ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు.అయితే ఇప్పుడు నాగార్జున స్థానంలోకి చిరంజీవి వచ్చారు. ఆశాజీవి మీ చిరంజీవి అంటూ తొలి ఎపిసోడ్ నుంచే షోను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు చిరు.

నిజానికి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే చాలామంది ప్రేక్షకులు నాగార్జునకు అలవాటైపోయారు. ఇప్పుడీ స్థానంలో చిరంజీవిని చూడడం అందరికి కాస్త కొత్తకొత్తగానే ఉంది. అయితే నాగార్జనతో పోలిస్తే.. మెగాస్టార్ స్టేజ్ పై మాట్లాడితే కాస్త నాటకీయంగా ఉంటుంది. అలాగే నాగార్జున తో పోల్చుకుంటే ఇంటరాక్షన్ కూడా తక్కువ. అయితే బుల్లితెరపై హోస్టుగా చేయడం చిరంజీవికి కొత్త కాబట్టి, ఎపిసోడ్లు జరుగుతున్న కొద్దీ ఆయన నాటకీయతలో మార్పు రావచ్చు. పైగా తన సహ నటీనటులతో ఆయన చేసే షోల తరువాత ఎంఈకేకు మరింత ఆదరణ లభించే ఛాన్స్ ఉంది.

ఇక తొలి ఎపిసోడ్ ని గమనిస్తే.. ఆడియన్స్ ను టెన్షన్ పెట్టడంలో కూడా చిరు తన మార్కును చూపిస్తున్నారు. నాగ్ వాయిస్ పోలిస్తే.. మెగా వాయిస్ ఈ షోకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. మొత్తానికి చిరంజీవి స్టార్ డమ్, చరిష్మా ఈ షోకి ప్లస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి, మెగాస్టార్ చేస్తున్న ఈ మెగా షోకు ఈ స్థాయిలో ఆదరణ వుందో తెలుసుకోవాలంటే ..టీఆర్ పీ రేటింగ్స్ వచ్చే దాక వెయిట్ చెయ్యాల్సిందే.

- Advertisement -