ఆగని ‘కాటమరాయుడు’ సునామీ

215
Katamarayudu teaser clicks 2 million Likes
- Advertisement -

పవన్ కాటమరాయుడు మానియాతో టాలీవుడ్ రికార్డులు బద్దలవుతున్నాయి. కాటమరాయుడికి సంబంధించి ఏ చిన్న ఫోటోఐనా ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ సినిమా దక్కించుకోని విధంగా సోషల్ మీడియాలో కాటమరాయుడు తెగ ట్రెండవుతోంది. సినిమా ఫస్ట్ లుక్‌, మూవీ మోషన్ పోస్టర్‌ నుంచి ట్రైలర్‌ వరకు  విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.

ఇటు పక్కా మాస్‌ లుక్‌లో ఫ్యాక్షనిస్ట్‌గా అటు కాటమరాయుడిలోని రొమాంటిక్‌ యాంగిల్‌ను చూపిస్తు విడుదల చేస్తున్న పిక్చర్స్‌ అభిమానులకు తెచ నచ్చేస్తున్నాయి. ఇక కాటమరాయుడు టీజర్ విడుదల చేసిన కొద్దిగంటల్లోనే 50 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 మూడు గంటల 5 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ సంపాదించగా కాటమరాయుడు కేవలం 2 గంటల్లోనే పది లక్షల వ్యూస్ సంపాదించింది. ఇక సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి టీజర్ రికార్డును కూడా కాటమరాయుడు కుమ్మేశాడు. కబాలి టీజర్ కు 2 మిలియన్ల వ్యూస్ ను అందుకునేందుకు 8 గంటల సమయం పట్టగా.. కాటమరాయుడు మాత్ర కేవలం 5 గంటల 23 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించేశాడు.

తాజాగా ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని మరో రికార్డును కాటమరాయుడు టీజర్ అందుకుంది. యూట్యూబ్ లో 2 లక్షల లైకులు కొట్టించుకున్న తొలి టీజర్ గా రికార్డు నెలకొల్పింది. ఇది బాహుబలి  లాంటి మెగా మూవీకి కూడా సాధ్యం కాని ఘనత. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లు కూడా ఈ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయాయి. అర నిమిషం టీజర్ తో.. చిన్న డైలాగ్ తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుని తన పవరేంటో చూపించాడు పవన్. వేసవి కానుకగా కాటమరాయుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

- Advertisement -