గాడ్ ఫాదర్..అప్‌డేట్

36
God Father

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతుండగా ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటుండగా తమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ ను రివీల్ చేయగా, సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉండగా తాజాగా ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ స్టార్ట్ చేశాడు యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గాడ్ ఫాదర్ మ్యూజిక్ సెషన్ ఫుల్ స్వింగ్ లో ఉందంటూ పోస్ట్ చేశారు.