మా ఎన్నికలు…లోకల్-నాన్ లోకల్ ఇష్యూ కాదు

30
suman

అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు సినీ నటుడు సుమన్. ఏపీలోని గాజువాకలో కరాటే చాంపియన్ షిప్ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్…మా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికలలో ఎవరైన పోటీ చేయవచ్చు.. స్థానిక లేక స్థానికేతర అనడం కరెక్ట్ కాదు.. అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడైన కలిసి నటిస్తున్నాం అన్నారు. అప్పుడు లేని స్థానిక అనే సమస్య ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.

ఎంతోమంది సీనియర్ ఆర్టీస్టులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూవీ ఆర్టీస్ట్ అసోసీయేషన్ ఎన్నికలో గెలిచినవారు మా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు సుమన్.