ఫెడ్ ఔట్ డైరెక్టర్ కి చిరు బ్రేక్ ఇస్తాడా..?

37
- Advertisement -

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ” భోళా శంకర్ ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో స్టార్ హీరో అజిత్ నటించిన ” వేదాలం ” సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఆయా హీరోల సినీ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి. ప్రభాస్ తో తీసిన బిల్లా మినహా.. కంత్రి, శక్తి, షాడో.. ఇవన్నీ కూడా ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఆ తరువాత నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. కానీ ఎవరు ఊహించని రీతిలో ఈ ఫెడ్ ఔట్ డైరెక్టర్ కు ” భోళా శంకర్ ” మూవీతో ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు మెగాస్టార్.

Also Read: పవన్ సినిమాల పై లేటెస్ట్ అప్ డేట్స్

అయితే ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ ఎప్పటికప్పుడు డిలే అవుతూనే ఉంది. ఈ మూవీని ఈ ఏడాది ఆగష్టు 11 న విడుదల చేసేందుకు సిద్దమైంది చిత్ర యూనిట్. అయితే ఈ మూవీ రీమేక్ ప్రాజెక్ట్ కావడం, అందులోనూ ఫెడ్ అవుట్ డైరెక్టర్ కావడంతో ” భోళా శంకర్ ” పై పెద్దగా హైప్ లేదనే చెప్పాలి. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రాయూనిట్. టీజర్ లో చిరు తెలంగాణ యాసతో చెప్పిన డైలాగ్స్ ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి. అలాగే టీజర్ లో చిరు లుక్స్, బ్యాక్ గ్రాండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం టీజర్ బాగుండడంతో మూవీపై అభిమానుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య మూవీతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read: పిక్ టాక్ : బోల్డ్ లుక్ లో గ్లామర్ ఫోజులు

- Advertisement -