గరికిపాటిపై చిరంజీవి సెటైర్

32
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిన విషయమే. అలయ్ భలయ్ కార్యక్రమంలో చిరంజీవితో మహిళా అభిమానులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతుంటే.. అది ఆపమని, లేదంటే తాను వెళ్లిపోతానంటూ గరికపాటి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇప్పుడిప్పుడే అంతా మర్చిపోయారు.

అయితే తాజాగా మరోసారి గరికపాటి అంశం తెరపైకి వచ్చింది. ఏకంగా చిరునే పరొక్షంగా సెటైర్ వేయడంతో మరోసారి గరికపాటి విషయం నెట్టింట వైరలవుతుంది. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్తకాన్ని రచించి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరింపజేశారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవగా.. గిరిబాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, ఉత్తేజ్ వంటి ఎందరో ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే చిరు మాట్లాడుతూ.. ఇక్కడ వారు లేరు కదా అంటూ వేలు పైకి చూపిస్తూ పరొక్షంగా గరికపాటిని గుర్తుచేసుకున్నారు. దీంతో అక్కడున్నవారు నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ యాక్సిడెంట్

కాంతారకు ఎదురుదెబ్బ ఎందుకో తెలుసా…

మంచి దొంగ.! దొంగిలిచ్చిన సొమ్ము తిరిగిచ్చేశాడు

- Advertisement -