తేజు కోసం రంగంలోకి సైరా..!

255
chiru sai dharam tej
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సాయిధరమ్ తేజ్‌. వై.వి.ఎస్. చౌదరి “రేయ్” సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, “పిల్లా నువ్వులేని జీవితం” సినిమాతో తెరంగేట్రం చేశాడు. కెరీర్ ప్రారంభంలో విజయాలకు కేరాఫ్‌గా నిలిచిన తేజ్‌..ప్రస్తుతం ఫ్లాప్ సినిమాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.

ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న తేజు.. కిషోర్ తిరుమలతో కలిసి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ‘చిత్రలహరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమైన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టి చిత్రాన్ని లాంచ్ చేశారు.

సాధారణంగా తేజు తన సినిమాల ఎడిటింగ్ సమయంలో చిరూకి చూపించి సలహాలు .. సూచనలు అడిగేవాడు. అలాంటిది ‘చిత్రలహరి’ షూటింగుకి ముందే కథను చిరంజీవికి చెప్పించాడట. చిరు కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పినట్టుగా సమాచారం.

తేజు సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా… రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించనున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -