- Advertisement -
మెగాస్టార్ చిరంజీవికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ బయల్దేరిన అరగంటకే సాంకేతిక లోపం తలెత్తండంతో వెంటనే అప్రమత్తమైన పైలట్… విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి ముంబై ఎయిర్‌పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఫ్లైట్‌లో మొత్తం 120మంది ప్రయాణికులు ఉన్నారు పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే పడిగాపులు కాయగా తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు.
ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్‌లో తన స్నేహితులకు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -