పీవీ సింధుకు మెగా సత్కారం.. వీడియో వైరల్

247
- Advertisement -

రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సింధును ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఇటీవల ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ ఫ్యామిలీ సభ్యులందరితో పాటు, కింగ్ నాగార్జున ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇలా సింధుని సత్కరించుకోవడం.. తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన ప్రేమ చూపించే ఇలాంటి వారికోసం ఇంకా కష్టపడేందుకు ప్రయత్నిస్తానని సింధు తెలిపారు. దీని సంబంధించిన ఓ వీడియోను మెగాస్టార్ చిరంజీవి ఇన్‌స్టాగ్రమ్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -