‘సామాన్యుడు’గా విశాల్ ఫస్ట్ లుక్..

122

తమిళ హీరో విశాల్ వరుసగా భారీ యాక్షన్ చిత్రాలతో మాస్‌లో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నాడు. విశాల్‌కి తమిళ, తెలుగు భాషలలో బాగా క్రేజ్ ఉంది. ఆయన నుంచి మాస్ అండ్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా వచ్చి ఆకట్టుకుంటున్నాయి. విశాల్‌ ప్రస్తుతం ‘సామాన్యుడు’ అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో నటిస్తున్నాడు. ఇది నాట్ ఎ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు తు.పా శరవణన్‌ ఈ మూవీని రూపొందిస్తున్నాడు.

అయితే ఆదివారం విశాల్ (ఆగస్ట్ 29) పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా రూపొందనున్నఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్‌లో రౌడీల బ్యాచ్ ని బేస్ బాల్ బ్యాట్‌తో చితక్కొడుతూ విశాల్ ఎగ్రెస్సివ్‌గా కనిపిస్తున్నారు. విశాల్ మరోసారి దూకుడున్న కుర్రాడిగా కనిపిస్తాడని ఈ పోస్టర్ చెబుతోంది. పోస్టర్ ట్యాగ్ లైన్‌ను సమర్థించేంత అర్థవంతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటించబోతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందివ్వనున్నారు. ఈ మూవీ విశాల్ స్వయంగా తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.