బహుముఖ ప్రజ్జాశాలి విజయనిర్మల…

398
chiru murali mohan
- Advertisement -

హైదరాబాద్ నానక్ రాం గూడలో ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థివ దేహానికి సినీ నటుడు మురళీ మోహన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విజయనిర్మల లేరు అనే మాట నమ్మలేకపోతున్నామని… సినీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాల్లో నటించిందని తెలిపారు. దర్శకురాలిగా 45 సినిమాలు తీసి ప్రపంచఖ్యాతికి ఎక్కిందని కొనియాడారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎంతో సహాయ సహకారాలు అందించిందని.. ఆమె మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటని తెలిపారు మురళీ మోహన్‌.

విజయనిర్మలలాంటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విజయ నిర్మల హఠాన్మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి విజ‌య‌నిర్మ‌ల అని కొనియాడారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, హీరోయిన్‌గా,దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారని గుర్తుచేశారు. ఆమె లేని లోటు కృష్ణ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటని చెప్పారు.

విజయ నిర్మల మరణం చాలా బాధకరమని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. నానక్ రాం గూడలోని విజయనిర్మల పార్థివ దేహానికి నివాళులర్పించిన హేమ…సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న కుటుంబాన్ని చాలా చక్కగా నడిపించారని తెలిపారు.విజయనిర్మల ఒక డైనమిక్ యాక్టర్, గిన్నిస్ రికార్డ్ నమోదు చేసిన దర్శకురారలని ఆమె సేవలను గుర్తుచేసిన హేమ సినీ ఇండస్ట్రీలో మహిళల కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.

- Advertisement -