‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ బీభత్సం- చిరు

34
chiru

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, ఈ రోజు ఉదయం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్.. చరణ్ పాత్రల స్వరూప స్వభావాలకు అద్దం పడుతూ ఆవిష్కరించిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ చూసిన మెగాస్టార్‌ చిరంజీవి వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ బీభత్సం.. ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తుంటాను..’’ అని చిరు స్పందించారు. ఇక ఈ ట్రైలర్ చూసిన మెగానందమూరి అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు. ఇద్దరూ హీరోలనూ సమ ఉజ్జీలుగా చూపించిన తీరుకి పొంగిపోతున్నారు. మరో చరిత్రని సృష్టించేందుకు టాలీవుడ్ వేదిక కాబోతోంది.. అనేలా కామెంట్లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.

ఇందులో బాలీవుడ్‌ నటి ఆలియాభట్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌.. తారక్‌కు జంటగా నటించారు. ద సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.