ప్ర‌తి గురువారం బ‌స్‌డే గా పాటించాలి- వీసీ స‌జ్జ‌నార్

27
VC Sajjanar

ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ప్ర‌తి గురువారం బ‌స్ డే పాటించాల‌ని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎండీ స‌జ్జాన‌ర్ గురువారం టెలిఫోన్ భ‌వ‌న్ నుంచి బ‌స్ భ‌వ‌న్‌కు ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. బ‌స్సులో ప్ర‌యాణికుల‌తో స‌జ్జ‌నార్ ముచ్చ‌టించారు. బ‌స్సుల స‌మ‌య‌పాల‌న‌, సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌, శుభ్ర‌త‌, సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. బ‌స్సు ప్ర‌యాణం సుర‌క్షితం, సౌక‌ర్య‌వంత‌మైంద‌ని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.