చిరు…భోళా శంకర్ ప్రారంభం

106
bolashankar
- Advertisement -

ఆచార్య తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన చిరు తాజాగా తన 155వ సినిమాను ప్రారంభించారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు భోళా శంకర్ అనే టైటిల్ ఖరారు చేయగా తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, బి.గోపాల్, ఎన్.శంకర్, కొరటాల శివ, వి వి వినాయక్, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.

కీర్తి సురేశ్ చిరు సోదరిగా కనిపించనుండగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’కు అఫీషియల్ తెలుగు రీమేక్ ‘భోళా శంకర్’.

- Advertisement -