ఆప్యాయంగా పలకరించేవారు – చిరంజీవి

293
Chiranjeevi And Ram Charan Visits Nandamuri Harikrishna Residence
- Advertisement -

నందమూరి హరికృష్ణ మరణం చాలా విషాదకరం, ఇండస్ట్రీకి ఇది దుర్దినం అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. మెహదీపట్నంలోని నందమూరి హరికృష్ణ నివాసంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Chiranjeevi And Ram Charan Visits Nandamuri Harikrishna Residence

రామ్ చరణ్ తో కలిసి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ హరికృష్ణ గారు తనకి చాలా మంచి సన్నిహితుడని, సోదరునితో సమానమని, ఆయన హఠాన్మరణం తనకి తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని, తన మనసుని కలచివేస్తుందని చెప్పారు. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆయన నేడు మనందరికీ దూరం కావడం ఎంతో బాధాకరమైన విషయం అని తన సంతాపాన్ని వ్యక్తం చేసారు. ఎప్పుడూ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే ఆయన ఇలా అందరినీ ఏడిపించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబం మనస్థైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపి హరికృష్ణ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసారు.

- Advertisement -