నా సినిమాలకు బన్నీనే కరెక్ట్!

106
chiru
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు హీరోగా రామ్ చరణ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు చిరు.

మీ కామెడీ సినిమాల్లో చంటబ్బాయి సినిమాని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు తీస్తే బాగుంటుంది, ఆ రోల్ లో ఎవరిని చూడాలి అనుకుంటున్నారు అని అడగగా నాకు తెలిసి చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్ లో బన్నీ చేయగలడని తెలిపారు చిరు.

బన్నీ బేసిక్ గా మిమిక్ కూడా. అన్ని కామెడీ వాయిస్ లు బాగా చేస్తాడు. మిమిక్రీతో నవ్విస్తాడు కూడా, బన్నీ చంటబ్బాయి సినిమా చేయగలడు అని తేల్చారు చిరు.

- Advertisement -