కనీసం సీగ్గుఎగ్గు ఉండాలే.. ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్‌..

43
kcr on modi
- Advertisement -

ఈరోజు హైదరాబాద్‌ హైటెక్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఏ ఒక్క రోజు కూడా మ‌నం డీజిల్ ధ‌ర, పెట్రోల్ ధ‌ర పెంచలేదు. కానీ కేంద్రం ఆకాశ‌మెత్తు పెంచిన డీజిల్ ధ‌ర‌ల‌తో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం ప‌డుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చి ఆ సంస్థ‌ను మ‌నం బ‌తికిస్తున్నం. ఆర్టీసీని జ‌ల్దీ అమ్మేయాల‌ని ప్ర‌ధాని మోదీ ప్రైజ్‌లు పెట్టారని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు.

ప్ర‌ధాని ఆర్టీసీని అమ్మినోళ్ల‌కు 1000 కోట్ల రూపాయ‌లు బ‌హుమ‌తి పెట్టిండు. ఆయ‌న అమ్మేది చాల‌ద‌ట‌. మ‌నం కూడా అమ్ముకోవ‌న్న‌ట‌. ఉన్న సంస్థ‌లన్నీ ప్రైవేట్ ప‌రం చేయండి. ఏ రాష్ట్ర‌మైతే అమ్ముత‌దో ..వారికి వెయ్యి కోట్ల ప్రైజ్ మ‌నీ పెట్టిన ఘ‌నుడు మ‌న ప్ర‌ధాన మంత్రి అని..ఇది జరిగే క‌థ‌. వాస్త‌వమ‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. టీఆర్ఎస్‌ శిక్ష‌ణా శిబిరాల్లో కేంద్రం కూట‌నీతి, దేశం ప్ర‌త్యామ్నాయం ఎజెండా, దేశం ముందుకు పోవాల్సిన విధానాలు, స్ప‌ష్ట‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న చేసి..అన్ని విష‌యాలు తేట‌తెల్లంగా తెలియజేయ‌డం జ‌రుగుతది. దాన్ని మ‌ళ్లీ ప్ర‌జాక్షేత్రంలో పెట్టి ఈ దుర్మార్గుల నీతిని ఎండ‌గ‌ట్టాల‌ని మ‌న‌వి చేస్తున్నాన‌ని పార్టీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఏదైనా నిర్మాణం చేయాలంటే చాలా స‌మ‌యం ప‌డుత‌ది. కానీ ఏదైనా విధ్వంసం చేయాలంటే చాలా సుల‌భంగా చేయొచ్చు. అనేక వేల‌వేల సంవ‌త్స‌రాల సంస్కృతి, సంప్ర‌దాయం, స‌హ‌న శీలత‌, ఓర్పు ఉన్న‌ట్వంటి వైవిధ్య‌మైన దేశం మ‌న భార‌త దేశం. 500 సంస్థానాల‌ను విలీనం చేసుకుని ఒక ఫెడ‌ర‌ల్ శ‌క్తిగా ఏర్ప‌డ్డ దేశం భార‌త‌దేశం. అలాంటి దేశంలో ఇపుడిపుడే అభివృద్ది ప‌థంలో న‌డుస్తున్న త‌రుణంలో భ‌యంక‌ర‌మైన విషాన్ని ఈ దేశంలో జొప్పిస్తా ఉన్న‌ర‌ని కేంద్రంపై తీవ్రంగా సీఎం కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

- Advertisement -