మెగాస్టార్ 152 మూవీకి హీరోయిన్‌ ఫిక్స్‌..!

656
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌లుగా చిరు 152 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

chiru152

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న దానిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క.. నయనతార ఇలా పలువురి భామల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా చిరుతో త్రిష న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. చిత్ర యూనిట్ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్‌లో ఓ కోలీవుడ్ విశ్లేష‌కుడు ఈ ఏడాది త్రిష మూడు సినిమాల్లో న‌టిస్తుందంటూ అందులో చిరంజీవి కొర‌టాల శివ సినిమా ఒకటంటూ మెసేజ్ పెట్టాడు.

trisha actress

దీనిపై స్పందించిన త్రిష నిజ‌మే! అంటూ విక్ట‌రీ సింబ‌ల్‌తో పాటు #2020 ను ట్యాగ్ చేశారు. అయితే త్రిష స్పంద‌న‌తో ఆమె చిరంజీవి 152 హీరోయిన్ అని అంద‌రూ క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్నారు. కానీ చిత్ర బృందం నుండి అఫిషియల్‌ ప్రకటన రావాల్సివుంది. త్రిష ఇదివరకే చిరుతో స్టాలిన్‌లో నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -