ఏప్రిల్ 7న.. `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే`

224
- Advertisement -

ప‌వ‌న్, గ‌ట్టు మ‌ను, సోనియా హీరో , హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న చిత్రం `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే`. సంతోష్ నేలంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పి.ఆర్. మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై గ‌ట్టు వెంక‌న్న‌, ప‌వ‌న్ సోని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.ఆర్.ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్పిస్తోంది. ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతం అందిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న సినిమా ఎస్.కె పిక్చ‌ర్స్ ద్వారా ఏప్రిల్ 7 న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత గ‌ట్టు వెంక‌న్న మాట్లాడుతూ `కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఇది. అంద‌మైన ల‌వ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించాం. ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా చ‌క్క‌గా తెర‌కెక్కించాం. ద‌ర్శ‌కుడు అనుకున్న క‌థ‌ను అనుకున్న విధంగా తెర‌కెక్కించారు. న‌వీన్, మ‌ను బాగా న‌టించారు. సోనాయాకు మ‌రో `హ్యాపీడేస్` మూవీలా నిలిచిపోతుంది. క‌థ‌లో కొన్ని ట్విస్ట్ ఉంటాయి. సినిమాకు అవి హైలైట్ గా ఉంటాయి. సెన్సార్ ఎలాంటి క‌ట్స్ లేకుండా క్లీన్ `యు` స‌ర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా చూసి వాళ్లు కూడా ప్ర‌శంసించారు. ఈ మ‌ధ్య కాలంలో ఇంత‌టి క్లీన్ సినిమాలు చూడ‌లేదు. గోహెడ్ అని ప్రోత్స‌హించారు. అలాగే మా చిత్రాన్ని ఎస్ .కె పిక్చ‌ర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. అందుకు ఎగ్జిబిట‌ర్లు అంతా బాగా స‌హ‌క‌రిస్తున్నారు. సినిమా మంచి స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం` అని అన్నారు.

Chinni Chinni Aasalu Naalo Regene Movie Release on 7TH

చిత్ర హీరో ప‌వ‌న్ మాట్లాడుతూ ` ప్ర‌తీ ఒక్క‌రికి ఏదో ఆశ ఉంటుంది. ఆ ఆశ కార‌ణంగా హీరో లైఫ్ ఎలాంటి ట‌ర్నింగ్ తిరిగింద‌న్న‌దే సినిమా క‌థ‌. బ్యూట్ ఫుల్ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో సినిమా బాగా వ‌చ్చింది. తెలుగు ప్రేక్ష‌కులంతా మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ -“చ‌క్కిన యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఇప్పుడంతా ప్రేమికుల యుగం. దాదాపు 90 శాతం యూత్ జంట‌ల‌గానే ఉన్నారు. అలా ఓ కుర్రాడు ప్రియురాలి కోసం ప్ర‌య‌త్నించి చివ‌రికి అమ్మాయి దొర‌క‌క నిరూత్సాహ ప‌డుతోన్న స‌మ‌యంలో ఓ సిమ్ కార్డు ఆ కుర్రాడి జీవితాన్నే మార్చేస్తుంది. ల‌వ‌ర్ లేద‌నుకుంటోన్న ఆ జీవితంలో వెలుగులు నింపే ఓ ప్రేయ‌సి గుండె త‌లుపులు త‌డుతుంది? త‌ర్వాత ఆ క‌థ ఎలా కంచింకి చేరిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా బాగా వ‌చ్చింది. కొత్త వాళ్లైనా అంతా బాగా న‌టించారు` అని అన్నారు.

Chinni Chinni Aasalu Naalo Regene Movie Release on 7TH

హీరోయిన్ సోనియా మాట్లాడుతూ -` చాలా క‌థ‌లు వింటున్నా. కానీ న‌చ్చ‌డం లేదు. ఈ క‌థ నాకు బాగా న‌చ్చింది. అందుకే సైన్ చేశా. బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ లో ఊహించ‌ని ట్విస్ట్ కూడా ఉన్నాయి. అవి సినిమాకు హైలైట్ గా ఉంటాయి. ఇందులో ఓపాట కూడా పాడాను. నేను క్లాస్ గా ఉన్నా పాట మాత్రం చాలా మాస్ గా ఉంటుంది. అంద‌రికీ బాగా న‌చ్చుతుంది. ఎస్.కె పిచ్చ‌ర్స్ ద్వారా సినిమా రిలీజ్ కావ‌డం ఆనందంగా ఉంది` అని అన్నారు.

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ- ` మంచి ల‌వ్ స్టోరీ ఇది. అందుకే ఈ సినిమా మా సంస్థ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో రిలీజ్ చేస్తున్నా. `మ‌నం `సినిమా లో బాగా పాపుల‌ర్ అయిన పాట `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే` లైన్ ను టైటిల్ గా పెట్టడం క‌లిసొస్తుంది. అంద‌రూ బాగా న‌టించారు. సోనియాకు హ్యాపీడేస్ సినిమాలా మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది. హీరో అంకిత భావంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. త‌న న‌ట‌న బాగుంది. అలాగే ఆర్ ఆర్. పాట‌లు బాగా వ‌చ్చాయి. నిర్మాత‌కు ఎగ్జిబిట‌ర్ గా ఎన్నో సినిమాలు చేసిన అనుభ‌వం ఉంది. ఆ అనుభ‌వంతోనే ఈ కొత్త ప్ర‌య‌త్నాం చేస్తున్నారు. క‌చ్చితంగా స‌క్సెస్ అవుతార‌ని ఆశిస్తున్నాం. రిలీజ్ కు ఎగ్జిబిట‌ర్లు అంతా స‌హ‌క‌రిస్తున్నారు` అని అన్నారు.

Chinni Chinni Aasalu Naalo Regene Movie Release on 7TH

మంచి పాట‌లు కుదిరాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సినిమా కూడా మంచి స‌క్సెస్ అవుతుంద‌ని ఆశిస్తున్నాం అని సంగీత ద‌ర్శ‌కుడు రాప్ రాక్ శ‌కీల్ అన్నారు.

తాగుబోతు ర‌మేష్‌, ఈరోజుల్లో సాయి, శ‌క‌ల‌క శంక‌ర్, గీతాసింగ్, చిట్టిబాబు, జెన్నీ, మ‌హేష్‌, న‌రేష్‌, అప్పారావు, చంద్ర‌మౌళి, శానీ, పింగ్ పాంగ్ సూర్య‌, భాష న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు : భాషా శ్రీ, కెమెరా: జ‌గ‌న్.టి, గోపాల్ క‌ట్టూరి, గోపీ కాక‌ర్ల‌, ఎడిటింగ్: ఎస్. బి ఉద‌య్, కోరియోగ్ర‌ఫీ: ఆర్.కెమాస్ట‌ర్, ఆర్ట్ : గోవింద్, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: స‌ంతోష్ నేలంటి, నిర్మాత‌లు గట్టు వెంక‌న్న‌, ప‌వ‌న్ సోనీ.

- Advertisement -