ప్రముఖ సింగర్ చిన్మయి పేరు తెలియని వారు ఉండరు. ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చున్న చిన్మయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు పలు విషయాలపై చురుకుగా స్పందిస్తుంది. గతంలో సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై గళమెత్తి పలువురు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. మీటూ ఉద్యమంలో దక్షిణాదిన ఎక్కువగా పోరాడింది చిన్మయి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ రైటర్‌గా ఉన్న వైరముత్తుకు చిన్మయి చుక్కలు చూపించారు. ఇదిలావుండగా.. చిన్మయి గర్భవతి అని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే తను ప్రగ్నెంట్ అంటూ వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. ఇక అసలు విషయం ఏంటంటే.. ఇటీవల చిన్నయి భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహంలో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో చిన్మయి చీరకట్టు ఉబ్బెత్తుగా ఉండడంతో చిన్మయి ప్రగ్నెంట్ అంటూ జోరుగా ప్రచారం చేశారు. మరి కొద్దిరోజులలోనే చిన్మయి తొలిబిడ్డకు జన్మనివ్వనుందని పుకార్లు పుట్టించారు. ఈ క్రమంలో చిన్మయి తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఇది మా పెళ్లి ఫొటో. మడిసార్ ధరించాను. మడిసార్ వలన నా పొట్ట పెద్దదిగా కనిపిస్తుంది. మడిసార్ క్యారీ చేయడంలో సమస్యలు ఉన్నాయి.
మడిసార్ వలన అలా కనిపిస్తుందే తప్ప నేను ప్రగ్నెంట్ కాదు. చిన్నయి బేబి బంప్ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లలో వస్తున్న వార్తలు చూసి విసిగిపోయాను. నా పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ప్రగ్రెంట్ అయినప్పుడు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు లేదా చేసుకోక పోవచ్చు. మేము వంద శాతం మా పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయను. వారు ఎలాగు సోషల్ మీడియాలో ఉండరు. తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను ఇప్పటికైనా ఆపాలని చిన్మయి కోరింది.