మాతృమూర్తులంద‌రికీ శుభాకాంక్ష‌లు- చిరు

74
chiru

ఈరోజు అంత‌ర్జాతీయ మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌పంచంలో త‌ల్లులంద‌రికీ శుభాకాంక్ష‌ల‌ను అంద‌చేస్తున్నారు. పలువురు త‌మ త‌ల్లుల ఫొటోల‌ను పోస్ట్ చేశారు. వారితో త‌మ‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజ‌నాదేవితో దిగిన ఫొటోను పోస్ట్ చేసి ప్ర‌పంచంలోని మాతృమూర్తులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందులో తన సోద‌రులు, సోద‌రీమ‌ణులు కూడా ఉన్నారు.కాగా,ప్రస్తుతం చిరు ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు.