భారతీయుల్లో మూడనమ్మకాలు ఎక్కువే. ఇది మరో సారి రుజువైంది. సాధారణంగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు నదులు కనబడితే ఇండియన్స్ నీళ్లలో రూపాయి కాయిన్స్ వేయడం వంటివి చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే చైనాలోని అన్హూయీ ప్రాంతంలో చోటు చేసుకుంది. కానీ కాయిన్ వేసింది నదిలో కాదు. విమానం ఇంజిన్‌లో.
ఓ బామ్మ లక్కీ ఎయిర్ జెట్‌కు చెందిన విమానం ఎక్కుతూ, ఆ విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేసింది. కాయిన్స్ వేస్తే తన ప్రయాణం క్షేమంగా జరుగుతుందన్న మూఢనమ్మకంతో ఆమె ఇలా చేసింది. ఇక దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు ఊరుకుంటారా…వెంటనే విమాన సిబ్బందికి తెలిపారు.
దీంతో పరిశీలించిన సిబ్బందికి ఆ బామ్మ విసిరిన కాయిన్స్ విమానం పక్కనే కింద కనిపించాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ట్రాన్స్ పోర్ట్ పోలీసులు ఆ బామ్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. ఉదయాన్నే ఆ విమానం ప్రయాణికులతో అన్హూయీ నుంచి కన్మింగ్ వెళ్లింది.
ఒక్కోసారి చాలామంది ఇలాంటి మూఢనమ్మకాలతోనే చిక్కుల్లో పడుతుంటారు. ఐనాసరే..మూఢనమ్మకాలను మాత్రం కొంతమంది వదలరుగాక వదలరు..!