ఎట్టకేలకు చైనాలో వీటిపై నిషేధం…

246
dog meat
- Advertisement -

కరోనా అంతుచిక్కని ఈ వైరస్‌తో ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్నాయి. తొలుత చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచదేశాలకు విస్తరించింది. తొలుత గబ్బిలం – పాము ద్వారా వ్యాపించిందని అంచానకు వచ్చినా అసలు కరోనా వైరస్‌ ఎలా పుట్టిందనే స్పష్టమైన ఆధారాలు లేవు.

ఇక కరోనాకు మాంసం ఉత్పత్తులు కారణమని చైనాలో కుక్కలు,పిల్లులు లాంటివి తినడమే ఈ వైరస్‌కు కారణమని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియదు గానీ డ్రాగన్ కంట్రీ ఆలస్యంగానైనా మేల్కొంది.

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో చైనాలోని షెన్‌జెన్‌ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములతో పాటు రక్షిత వన్యప్రాణులకు తినడాన్ని నిషేధించారు. పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలకు నిషేధం నుంచి మినహాయించారు.

- Advertisement -