ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లో పుట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రభలిన ఈ వైరస్ ప్రస్తుతం 199 దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. 30వేల మంది మరణించారు. చైనాలో ఇప్పటివరకు 3వేల మంది మరణించినట్లు ప్రకటించారు అక్కడి అధికారులు. కానీ తాజాగా ఉన్న సమాచారం ప్రకారం అక్కడ మరణాలు డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయంటున్నారు వూహాన్ నగర వాసులు.
ఇప్పటివరకు వూహాన్ లో 42వేలకు పైగా మంది మరణించినట్లు వూహాలు ప్రజలు చెబుతున్నారు. కానీ చైనా ప్రభుత్వం అక్కడి మరణాల సంఖ్యను దాచిపెట్టినట్లుగా తెలుస్తుంది. నెల రోజుల వ్యవధిలో 28 వేల మృతదేహాలను దహనం చేశారని, మృతుల లెక్కపై సమగ్ర దర్యాఫ్తే లేదని, లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే మరణించారని అంటున్నారు. అధికారిక గణాంకాలతో పోలిస్తే, మృతుల సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉందని అంటున్నారు వూహాన్ ప్రజలు. కాగా చైనాలో కరోనాను కట్టడి చేసేందుకు 60రోజులు లాక్ డౌన్ ను ప్రకటించారు. ప్రస్తుతం చైనాలో కొత్త కేసులు రావడం లేదని తెలిపారు.