ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యం..!

147
asian
- Advertisement -

చైనాలోని హాంగ్‌జౌ నగరం ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడలు హాంగ్‌జౌలో 2023 సెప్టెంబర్‌ 23 నుండి అక్టోబర్‌ 8 వరకు జరుగుతాయని ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా (వోసీఏ) మంగళవారం తెలిపింది. వాస్తవానికి ఈ క్రీడలను 2022వ సంవత్సరంలో జరగాల్సి ఉండగా….. చైనాలో కొవిడ్‌ విజృంభిస్తోన్న వేళ వాటిని 2023లో నిర్వహిస్తామని తెలిపింది. హాంగ్‌జౌ నగరం చైనా రాజధానికి 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంటుంది. ఆసియా క్రీడలకు దాదాపుగా 10,000 మంది ఔత్సాహిక క్రీడాకారులు వస్తారని వోసీఏ తెలిపింది. చైనా జీరో టోలరెన్స్ విధానంలో భాగంగా ఈసంవత్సర ప్రారంభంలో నెలల తరబడి లాక్‌డౌన్‌లు భరించింది. జూన్‌లో చెంగ్డూలో ప్రారంభం కావాల్సిన వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ గత సంవత్సరం నుండి వాయిదాలు పడుతూ వస్తున్నాయి…. మళ్లీ 2023 వరకు వాయిదా పడ్డాయి.

- Advertisement -