చైనాలో మళ్లీ లాక్‌ డౌన్‌!

78
china

చైనాలో మళ్లీ కరోనా పంజా విసిరింది. దీంతో మరోసారి లాక్ డౌన్ బాట పట్టింది చైనా. హెబీ ప్రావిన్స్‌లో 380 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అంతా షాక్‌ అయ్యారు. అయితే వీరిలో ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు కనిపించలేదు.

ప్రస్తుతం హెబీ ప్రావిన్స్‌లో కొత్త కేసులు నమోదవుతుండటం అక్కడి ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తున్నది. హెబీ ప్రావిన్స్‌ దేశ రాజధాని నగరం బీజింగ్‌కు సమీపంలోనే ఉండటంతో హెబీ నుంచి బీజింగ్‌కు రాకుండా వాహనాల ప్రయాణాన్ని పరిమితం చేశారు. ప్రజా రవాణా, టాక్సీలను నిలిపివేశారు.

ప్రజలను వారంరోజుల పాటు తమతమ గ్రామాలు దాటి రావొద్దని హెచ్చరికలు జారీచేశారు. 2022 లో వింటర్ ఒలింపిక్స్‌ హెబీలో జరుగనున్నాయి. ప్రస్తుతం హెబీలో కొత్త కేసులు నమోదవుతుండటంతో వింటర్ ఒలింపిక్స్‌ జరుపడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.