చైనాలో మరో కొత్త వైరస్..

148
china
- Advertisement -

కోవిడ్ 19తో ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ కోట్లాది మందిని బలితీసుకోగా కోట్ల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఇక తాజాగా అదే చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోతుల నుంచి సంక్ర‌మించే మంకీ బీ వైర‌స్ మాన‌వుల్లో తొలికేసు న‌మోద‌యింది. తొలికేసు న‌మోదైన కొన్ని రోజుల్లోనే ఆ వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్టు చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మంకీబీ సోకిన వ్య‌క్తి నుంచి మ‌రోక‌రికి ఈ వైర‌స్ సోక‌లేదని స్పష్టం చేసింది.

జంతువుల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపే ఓ ప‌శువైద్యుడికి తొలిగా ఈ వైర‌స్ సోకింది. ఈ ఏడాది మార్చిలో చ‌నిపోయిన కొతుల‌ను పోస్ట్‌మార్టం చేసి ప‌రిశోధ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో వాటి నుంచి మంకీబీ వైర‌స్ ఆ వైద్యుడికి సోకింది. వాంతి, వికారం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యాడు. కొద్దిరోజుల్లోనే ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ వైర‌స్ సోకితే మ‌ర‌ణాల సంఖ్య 70 నుంచి 80 శాతం ఉంటుంద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పరిశోధ‌కులు చెబుతున్నారు.

- Advertisement -