కార్తీక దీపం…అంజి ఎంట్రీతో మోనిత బలికాబోతుందా..?

133
karthika deepam

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డైలీ సీరియల్ కార్తీకదీపం. ఇప్పటివరకు 1094 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోగా ఈ ఎపిసోడ్లో భాగంగా మోనిత…నటనను కనిపెట్టిన దీప…అక్కడ ఏం జరిగిందో కార్తీక్‌కు ఉహించినట్లుగా చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. తర్వాత ఏసీపీ రోషిణితో మోనిత నిజస్వరూపం గురించి చెబుతుంది దీప. తర్వాత అంజి గురించి రోషిణికి చెబుతుంది దీప. దీంతో నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచిచూడాలి.

ఇక మోనిత ఇంటి నుండి బయలు దేరిన కార్తీక్…ఆమె చేసిందంతా నాటకం అని గుర్తిస్తాడు. ఆలోచిస్తూ దీప ఇంటికి చేరుకోగా అక్కడ జరిగింది ఊహించి చెబుతుంది. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఎలా ఉంది నాటకం? మోనిత బాగా రక్తి కట్టించిందా? సాక్ష్యం కోసం మీకు ఫోన్ చేసింది.. చచ్చేదే అయితే.. ఇలా ఎందుకు పిలుస్తుంది? ఎప్పుడైనా అఘాయిత్యానికి పాల్పడే వాళ్లు ఫోన్ చెయ్యరు. పక్కవారు చేస్తారు. అంటుంది దీప.

తర్వాత దీప భాగ్యంతో మోనిత గురించి మాట్లాడుతుంది. నా భర్తని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉంది.. పైగా 25 తారీఖు దగ్గర పడుతుంది.. ఈ లోపే దాన్ని వదిలించుకోవాలి. డాక్టర్ బాబుకి నాకు మనశాంతే లేదు అంటూ బాధపడుతుంది దీప. దీంతో ఓ స్కెచ్ వేయగా సూపర్‌గా ఉంది అంటుంది భాగ్యం. తర్వాత రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్లిన ఆనందరావుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతాయి.

ఇక రోషిణీ ఫోన్‌లో మాట్లాడుతుండగా.. మోనిత గురించి చెప్పేందుకు వచ్చాను మేడమ్ అని చెబుతుంది దీప. మోనిత ఇంట్లో ప్రియమణిని ఆరా తీశాను.. నీ భర్త మోనితని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని చెప్పింది. అది అబద్దమా అంటుంది రోషిణీ. నిజమే కానీ రోషానికి ఉక్రోషానికి ముడిపెట్టినప్పుడు జరిగిన విషమది.. ఒకచిన్న సంఘటన చెబుతాను.. అని వివరించే ప్రయత్నం చేస్తుంది దీప. మేము విడిగా ఉన్నమని మా అత్తగారు మమ్మల్ని కలపాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఆయన మోనిత అనే ఒక బూచిని చూపించి బెదిరించేవారు.. ఇప్పుడు చెప్పండి బురదలోకి దూకుతా దూకుతా అని బెదిరించేవాడు ఎప్పుడైనా బురదలోకి దూకుతాడా? ఆయన దూకలేదు అని క్లారిటీ ఇస్తుంది.

మరి మోనిత కడుపు సంగతేంటి అనగానే డాక్టర్ బాబు ఎలాంటి వ్యక్తో ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారో నాకు తెలియకపోతే.. పదేళ్లు ఆయన కోసమే తపించడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? మోనితలా మోజు పడిన ఆడదానా? అని చెప్పుకొస్తుంది. మోనిత నిజం చెప్పడం లేదు…ఏదో దాచి పెడుతుంది.. నా భర్త మంచితనాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.. ఆయన తప్పు చేస్తే.. కచ్చితంగా తప్పుని ఒప్పుకుంటారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప.

ఒకవేళ నా భర్త తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వేసినా నేను కాదు అనను మేడమ్.. మీరు అన్నట్లే ఇది సరిహద్దు రేఖ. కానీ నిజానికి అబద్దానికి మోనిత గీసిన రేఖ.. ఈ రేఖ గురించి చెప్పాలంటే.. ముందు మీకు అంజీ గురించి చెప్పాలి అంటుంది దీప. అంజీని తీసుకుని రాగలిగితే.. అన్ని నిజాలు బయటికి వస్తాయి మేడమ్ అని చెప్పగా ఎపిసోడ్ ముగుస్తుంది.