ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు. చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ వైరస్ 202 దేశాలకు పాకింది. లక్షల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతుండగా వేల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
అయితే కరోనా పుట్టిన వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తివేశారు. 76 రోజుల నిర్భందం తొలగిపోవడంతో ప్రజలు బయటికి వచ్చారు. వుహాన్ వాసుల ప్రయాణాలకు అనుమతి లభించిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అయితే కరోనా భయం వీడకపోవడంతో వుహాన్ ప్రజలు ఇంకా మాస్క్‌లు ధరించే ప్రయాణాలు సాగిస్తున్నారు.
లాక్‌డౌన్ తొలగించడంతో వుహాన్‌లో రాకపోకలు మొదలయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రాగా 76 రోజుల తర్వాత దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో సందడి నెలకొంది. పాఠశాలలు మినహా మిగితా సర్వీసులు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాలకు బయలుదేరిన జనంతో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది.