ఇవాళ తనకెంతో ప్రత్యేకం: చిరు

195
chiru

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్న చిరు…తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా అందరీకి శుభాకాంక్షలు తెలిపారు.

తాను హనుమంతుని భక్తునిగా ఎలా మారానో అభిమానులతో పంచుకున్నారు. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

హనుమాన్ బొమ్మ తన దగ్గర ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో అన్నారు.