- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే రష్యా తొలి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన దేశంగా రికార్డు సృష్టించగా చైనా వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్నాయి.
కరోనా టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను వివిధ దేశాల్లోని 50వేల మంది వలంటీర్లపై నిర్వహిస్తున్నట్లు సీఎన్‌బీజీ పేర్కొంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా మూడో దశ ట్రయల్స్ ఉజ్బెకిస్తాన్‌లో కూడా జరుగుతుందని కంపెనీ జూలైలో తెలిపింది.
కాగా చైనా వ్యాక్సిన్ ట్రయల్స్ బహ్రెయిన్, యూఏఈ, మొరాకో, పెరూ, అర్జెంటీనాతో సహా అనేక దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పాకిస్థాన్ కూడా ఆసక్తి చూపించింది.
- Advertisement -