వీడియో..ప్రపంచంలోనే ఎత్తైన వంతెన!

19
- Advertisement -

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ను నిర్మిస్తోంది చైనా. త్వరలోనే ఈ బ్రిడ్జి ప్రారంభంకానుండగా ఇది అందుబాటులోకి వస్తే గంట ప్రయాణం ఒక నిమిషంలో పూర్తి కానుంది. జూన్‌లో ప్రారంభమయ్యే హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా నిలవనుంది.

ఈ వంతెన నిర్మాణం కోసం రూ.2200 కోట్లు (216 మిలియన్ పౌండ్లు) ఖర్చయ్యింది. ఇది ఐఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తుగా ఉండి, దానికంటే మూడింతల బరువు కలిగి ఉంది. ఈ వంతెన రెండు మైళ్ళ పొడవున ఒక పెద్ద గుండ్రంలో (గ్రాండ్ క్యానియన్) విస్తరించి ఉండటం విశేషం. దీనివల్ల ఇప్పటివరకు గంట సమయం పడుతున్న ప్రయాణం కేవలం ఒక నిమిషంలో పూర్తి చేయవచ్చు.

ఈ వంతెన ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రవాణా మార్గం మెరుగపర్చడమే కాదు పర్యాటక ప్రాంతంగా కూడా మారనుందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ వంతెన దాదాపుగా మొత్తం భాగం పెద్ద లోయ పైకి వేలాడుతూ నిర్మించబడినదే కావడం దీని విశిష్టత.

 

Also Read:విజయశాంతి దంపతులకు బెదరింపులు

- Advertisement -