- Advertisement -
నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెయిన్ బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ నిర్వహించిన చిల్డ్రన్స్ డే వేడుకలు ఈ నెల 12, 13న హైదరాబాద్ లోని ఫోనిక్ గార్డెన్ లో అంగరంగ వైభవంగా జరిగాయి.12న షార్ట్ ఫిలింస్ కాంటెస్ట్ తో పాటు క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్ కాంపీటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజేతలైన వారికి 13న కల్చర్ యాక్టివిటీస్ నిర్వహించి బహుమతులు అందజేసారు.
రెయిన్ బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ సెక్రటరీ, ‘అప్పూ’ ది క్రేజీ బోయ్ చిత్ర దర్శకనిర్మాత కె.మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో కొత్త శ్రీనివాస్, కొత్త కృష్ణవేణి, జబర్ధస్త్ అప్పారావు, నటుడు లోహిత్ కుమార్, నిర్మాత బి.సుధాకర్, పద్మిని నాగులపల్లి, రచయిత, డైరెక్టర్ డాడి శ్రీనివాస్, డైరెక్టర్ కళా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -