దేశంలో రోజు రోజుకు అమ్మాయిలపై, చిన్నారులపై అత్యాచార ఘటనలు పెరగుతూనే ఉన్నాయి. చిన్నారులపై, ఇప్పటికైనా చట్టాలు కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందని మెజారీటీ భారతీయులు భావిస్తున్నారట. నిర్భయ ఘటన, మొన్న ఆసిఫా, ఉన్నావ్ ఘటనలు జరిగిన అత్యాచార ఘటనలు యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాయి.
అత్యాచార ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.12 సంవత్సరాలలోపు చిన్నారులపై, బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రూపొందించింది.బాలికలపై అత్యాచారం చేసే వారికి మరణశిక్ష విధించాలన్న ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన సంగతి తెలిసిందే.
ఆర్డినెన్సుకు సంబంధించి మెజారిటీ భారతీయులు ఏమనుకుంటున్నారో అని ఓ సర్వే నివేదిక వెల్లడించింది. 76 శాతం మంది ప్రజలు రేపిస్టులకు ఉరి శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పేశారు. 18 శాతం మంది ప్రజలు మాత్రం పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించాలని భావిస్తున్నారట. 3శాతం మంది ప్రజలు మాత్రం చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో 40 వేల మందికి పైగా ప్రజలు మాత్రమే తమ అభిప్రాయాన్ని వెల్లడించారట.