గ్రీన్ ఛాలెంజ్‌లో బాలనటుడు బుల్లిరాజు

4
- Advertisement -

సంక్రాంతి కి వస్తున్నాం సినిమా ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ (బుల్లి రాజు ) ఈ రోజు సక్సెస్ మీట్ కి వచ్చిన సందర్బంగా మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్   గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలానిలో మొక్కలు నాటడం జరిగింది.

సినిమా సక్సెస్ ని మొక్కను నాటుతూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. చెట్లను పంచి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నారు. ప్రకృతి బా ఉంటేనే మనం బా ఉంటాం అని అదే విదంగా ప్లాస్టిక్ ని నిషేధించి పేపర్ బ్యాగ్స్ లేదా జూట్ బ్యాగ్స్ వాడాలని కోరారు.

ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టి మా లాంటి పిల్లల భవిష్యత్తు కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విదంగా ఈ సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి: హరీశ్‌ రావు

- Advertisement -