తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్‌ ధరలు..

73
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కోడి మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో చికెన్ (స్కిన్ లెస్) ఇప్పుడు రూ.300 పలుకుతోంది. నెల క్రితం రూ.140 నుంచి రూ.160 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.300కి చేరిండంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వినియోగదారులు జంకుతున్నారు. అయితే కోడిమాంసం ధరల పెరుగుదలకు వ్యాపారులు పలు కారణాలు చెబుతున్నారు. కోళ్ల ఫారంలలో ఉపయోగించే దాణా రేటు పెరిగిపోవడం, ఫారంలలో కొత్త బ్రీడ్ ప్రారంభించకపోవడంతో ఉన్న కోళ్లతోనే నెట్టుకురావాల్సి ఉండడం వంటి కారణాలు చికెన్ ధరను పెంచేశాయని అంటున్నారు.

మామూలుగా అయితే వేసవిలో చికెన్‌ ధరలు తగ్గుతాయి. వేసవి తాపానికి కోళ్లు చచ్చిపోతాయని పూర్తి బరువుకు రాకముందే కోళ్లను పౌల్ట్రీ రైతులు అమ్మేస్తుంటారు. దాంతో కిలో చికెన్ ధర రూ.160 నుంచి రూ.180 మధ్యలో ఉండేది. అయితే ఈసారి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. తద్వారా ధరలు పెరిపోయాయి.

- Advertisement -