ధరల పెంపు ఇప్పుడు ఇది సర్వసాధారణమైపోయింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు కూరగాయలు ధరలు సామాన్యులకు గుదిబండగా మారగా తాజాగా చికెన్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి.
ఆదివారం కిలోకు రూ.100 నుంచి 120 వరకు రేటు పెంచారు. హోల్‌సేల్‌లో స్కిన్‌లెస్ కిలో రూ.290 నుంచి రూ.310 మధ్యన, లైవ్ రూ.170కి విక్రయించారు. రిటైల్‌లో రూ.320 నుంచి రూ.340 వరకు, లైవ్ కోడిని రూ.190, నాటుకోడి కిలో రూ.380 నుంచి రూ.400 వరకు విక్రయించిన పరిస్థితి కనిపించింది.
Also Read:డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటో తెలుసా?
వేసవి ఎండలు విపరీతంగా ఉండటం, వేడి గాలులు వీస్తుండటంతో ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. ఇదికూడా చికెన్ ధర పెరగడానికి మరో కారణం. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణం కాగా ఎండల తీవ్రత ఇలాగే ఉంటే చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.