యువకుడిపై చేయి చేసుకున్న కలెక్టర్.. సీఎం ఆగ్రహం..

124
- Advertisement -

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ ఐఏఎస్‌ అధికారి అత్యుత్సాహం చూపించాడు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ యువకుడి చెంపను ఛెళ్లుమనిపించిన సూరజ్‌పూర్ కలెక్టర్ రణబీర్ శర్మపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ చర్యలు తీసుకున్నారు. రణబీర్ శర్మను కలెక్టర్ పోస్టు నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ చర్యను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి ఈ ఘటన విచారకరమన్నారు. రణబీర్‌ను తప్పించిన సీఎం ఆయన స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్‌కుమార్ సింగ్‌ను నియమించారు.

యువకుడిపై కలెక్టర్ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాను చుట్టేసింది. మరోవైపు, రణబీర్ ప్రవర్తనను ఐఏఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది. సేవ, నాగరికత ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. కాగా, కలెక్టర్ రణబీర్ శర్మ ఆ తర్వాత తన ప్రవర్తనకు క్షమాపణలు తెలిపారు.

ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో జరిగింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో చత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. దీంతో పోలీసుల‌తో క‌లిసి క‌లెక్ట‌రు రణబీర్ శర్మ లాక్‌డౌన్ నిబంధ‌న‌ల అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆ సమయంలో అమన్ మిట్టల్ (23)గా అనే యువ‌కుడు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మాస్క్ పెట్టుకుని వ‌చ్చిన ఆ యువ‌కుడు త‌న‌కు బ‌య‌ట తిరిగేందుకు అనుమ‌తి ఉంద‌ని క‌లెక్ట‌ర్‌కు చెప్పాడు.

అయితే, ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు. ఆ యువ‌కునిపై క‌లెక్ట‌ర్ చేయిచేసుకున్నారు. సెల్‌ ఫోన్‌ లాక్కొని నెలకేసి కొట్టారు. అనంత‌రం పోలీసులు వ‌చ్చి ఆ యువ‌కుడిని లాఠీల‌తో కొట్టారు. ఆ యువకుడిని కొట్టాలని కలెక్టర్ ఆదేశించడం విమ‌ర్శ‌లకు తావిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డం, క‌లెక్ట‌ర్ తీరుపై జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డంతో చివ‌ర‌కు సూరజ్‌పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ యువకుడిని అవ‌మానించే ఉద్దేశం త‌న‌కు లేద‌ని తెలిపారు.

- Advertisement -