చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..

171
ntr

ఎన్టీఆర్ బయోపిక్‌ రిలీజ్‌కు మరికొద్దిగంటలు మాత్రమే మిగిలిఉంది. నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రేపు(జనవరి 9న) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం రెండోభాగం ఫిబ్రవరిలో విడుదల కానుంది.

తాజాగా ‘కథానాయకుడు’ చిత్రంలోని ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..’ అనే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.ఈ పాటలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యాబాలన్‌ బసవతారకం పాత్రలో నటించారు.ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలయ్య నిర్మాతగా వ్యవహరించారు.

Cheyyetthi Jai Kottu Telugoda Song Promo - NTR Kathanayakudu - Nandamuri Balakrishna | Vidya Balan