రెమ్యునరేషన్‌ బ్యాక్‌ ఇచ్చిన సాయిపల్లవి..!

260
sai pallavi

సాయిపల్లవి…తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రేమమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఫిదాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ కోలీవుడ్‌ బ్యూటీ తన పెద్ద మనసు చాటుకుంది.

శర్వానంద్ హీరోగా సాయిపల్లవితో నటించిన చిత్రం పడిపడి లేచే మనసు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చేసింది సాయిపల్లవి. కథకు అందులో పాత్రకు ప్రాధాన్యమిచ్చే ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ విషయంలో పెద్దగా పట్టించుకోదు.

పడి పడి లేచె మనసు ఆశించిన స్థాయిలో ప్రేక్షక ఆదరణ పొందలేక పోయింది. సో ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసిందట. సాధారణంగా తమ సినిమాలు ఆడనప్పుడు స్టార్ హీరోలు కొంతమంది రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చేస్తుంటారు అలా సాయిపల్లవి సైతం వారిబాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది.