సంజూ అక్కడే తప్పుచేశాడు!

0
- Advertisement -

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వెస్టిండీస్‌తో రెండో టీ20లో 82 పరుగులతో అదరగొట్టాడు. అయితే మూడో టీ20లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు. కేవలం 6 బంతులు ఎదుర్కొని 3 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ చతేశ్వర్ పుజారా.. సంజూ ఔట్ కావడానికి గల కారణాలను విశ్లేషించాడు. వికెట్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోవడమే అతడి వైఫల్యానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.

ఆదివారం ఇండోర్‌లో జరిగిన మూడో టీ20లో షమర్ జోసెఫ్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కమిల్ పూరన్ అతడి క్యాచ్ అందుకున్నాడు. సంజూ త్వరగా ఔటైనప్పటికీ, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరు సాధించింది. అభిషేక్ కేవలం 30 బంతుల్లో 69 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 223 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ గట్టిగా పోరాడినప్పటికీ, 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

‘గేమ్‌ప్లాన్‌’లో మాట్లాడిన పుజారా.. సంజూ వికెట్ పరిస్థితులను మరింత జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందని పేర్కొన్నాడు.వికెట్ ఎలా ఉందో సంజూ మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సింది. మరోవైపు అభిషేక్ శర్మ కూడా క్రీజులో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకుంటున్నాడు. దీంతో సంజూకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అతడు కొంచెం ముందుగానే వేగం పెంచాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ తప్పిదం జరిగింది అని పుజారా వివరించాడు.

Also Read:ది ట్రైటర్స్ తెలుగు..క్లోక్‌మెన్ సందడి

బ్యాట్ అతడి చేతుల్లో తిరిగిపోయింది. బౌలర్ వేసిన బంతి కచ్చితంగా మంచి బంతే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ, సంజూకు మరికొంత సమయం లభించి ఉంటే అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేసేవాడని నేను భావిస్తున్నాను అని పుజారా అభిప్రాయపడ్డాడు.

- Advertisement -