“మహర్షి” కోసం రంగంలోకి “వెంకీమామ”

165
Maharshi Venkatesh

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. మహేశ్ బాబు కెరీర్ లో ఈమూవీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు ..ఎందుకంటే ఆయన కెరీర్ లో ఇది 25వ సినిమా. ఇక ఈమూవీలో మహేశ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా… అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాను మే9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈరోజు ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగనుంది. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఈఫంక్షన్ జరుగనుంది.

ఈ కార్యక్రమానికి మహేశ్ ఇప్పటి వరకూ నటించిన 24 సినిమాల దర్శకులు రానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ లో ఇద్దరిలో ఎవరో ఒకరు రానన్నట్లు ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబులు ముగ్గురు మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మరో ముఖ్యమైన వ్యక్తి కూడా రాబోతున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు.

విక్టరీ వెంకటేశ్ మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా రానున్నారు. మహేశ్ బాబు , వెంకటేశ్ ఇద్దరూ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పుకోవచ్చు.. మహేశ్ నటించిన శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్ కు ఛీఫ్ గా గెస్ట్ గా వెంకటేశ్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.