చెన్నై టెస్టు..బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

134
root

చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. భార‌త జ‌ట్టులోకి న‌దీమ్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు రాగా జో రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ బ‌రిలోకి దిగనుంది. చెన్నై వికెట్‌పై చివ‌ర్లో ఆడ‌డం ఇబ్బందిగా ఉంటుంద‌ని, కానీ తాను ఇండియాలో బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయ‌నున్న‌ట్లు రూట్ తెలిపాడు.

ముందుగా టాస్ గెలిస్తే, తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని తెలిపిన విరాట్… లోక‌ల్ ప్లేయ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు తుది జ‌ట్టులో స్ధానం దక్కింది.

భారత జట్టు: రోహిత్ శర్మ,శుభ్‌మన్‌ గిల్,పుజారా,కోహ్లీ,రహానే,రిషబ్ పంత్,సుందర్,అశ్విన్,ఇషాంత్ శర్మ,బుమ్రా,నదీమ్

ఇంగ్లాండ్ జట్టు: రోరి బర్న్స్,సిబ్లీ,లారెన్స్,జో రూట్,బెన్ స్టోక్స్,పోప్,బట్లర్,బెస్,జోఫ్రా అర్చర్,లాక్ లీచ్,అండర్సన్.