భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం..

175
rains
- Advertisement -

భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమైంది. రోడ్లన్ని చెరువులను తలపిస్తుండగా కాలనీలన్నీ నీటి మునిగాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెన్నై ఎగ్మూర్‌ రోడ్డు పూర్తిగా నీట మునిగిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఇటు సిటీలోని 11 సబ్‌వేల్లో నీరు వచ్చి చేరడంతో దాన్ని తోడేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 267 చోట్ల చెల్లు కూలిపోయాయని, 68 చోట్ల రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించామని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ చెబుతోంది.

శుక్రవారం కూడా తమిళనాడు వ్యాప్తంగా అతిభారీ నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, తీరం దాటిన తర్వాత ఊడా కొన్ని గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాలతో తమిళనాడులో మొత్తం 15 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. పది జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు అందిస్తున్నాయి. మరో రెండు జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి.

- Advertisement -