చెన్నై సూపర్‌కింగ్స్‌దే వాంఖ‘డే’. షేన్ వాట్సన్ (117 నాటౌట్; 57 బంతుల్లో 11×4, 8×6) వీర విధ్వంసంతో ఆదివారం ఐపీఎల్-11 ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. కేన్ విలియమ్సన్ (47; 36 బంతుల్లో 5×4, 2×6), యూసుఫ్ పఠాన్ (45 నాటౌట్; 25 బంతుల్లో 4×4, 2×6) చెలరేగడంతో మొదట సన్‌రైజర్స్ 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఆరంభంలో పరుగుల కోసం చెమటోడ్చినా.. వాట్సన్‌కు రైనా (32; 24 బంతుల్లో 3×4, 1×6) సహకరించడంతో లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
హైదరాబాద్: గోస్వామి (రనౌట్) 5, ధవన్ (బి) జడేజా 26, విలియమ్సన్ (స్టంప్డ్) ధోనీ (బి) కర్ణ్ శర్మ 47, షకీబల్ (సి) రైనా (బి) బ్రావో 23, యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 45, హుడా (సి) సబ్/షోరె (బి) ఎన్‌గిడి 3, బ్రాత్‌వైట్ (సి) రాయుడు (బి) శార్దూల్ 21; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 178/6; వికెట్ల పతనం: 1-13, 2-64, 3-101, 4-133, 5-144, 6-178; బౌలింగ్: చాహర్ 4-0-25-0, ఎన్‌గిడి 4-1-26-1, శార్దూల్ ఠాకూర్ 3-0-31-1, కర్ణ్ శర్మ 3-0-25-1, డ్వేన్ బ్రావో 4-0-46-1, జడేజా 2-0-24-1.
చెన్నై: వాట్సన్ (నాటౌట్) 117, డుప్లెసిస్ (సి అండ్ బి) సందీప్ శర్మ 10, రైనా (సి) గోస్వామి (బి) బ్రాత్‌వైట్ 32, రాయుడు (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.3 ఓవర్లలో 181/2; వికెట్ల పతనం: 1-16, 2-133; బౌలింగ్: భువనేశ్వర్ 4-1-17-0, సందీప్ శర్మ 4-0-52-1, సిద్దార్థ్ కౌల్ 3-0-43-0, రషీద్ ఖాన్ 4-1-24-0, షకీబల్ 1-0-15-0, బ్రాత్‌వైట్ 2.3-0-27-1.