బెంగళూరుపై చెన్నై విజయం..

251
Chennai Super Kings
- Advertisement -

ఐపీఎల్ 12వ సీజన్‌కు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ శుభారంభం చేసింది.. గత సీజన్లకు భిన్నంగా నిరాడంబరంగా మొదలైన లీగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 70 పరుగల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో ఛేదించింది. మూడు కీలక వికెట్లు పడగొట్టిన హర్భజన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) జడేజా (బి) హర్భజన్‌ 6; పార్థివ్‌ (సి) జాదవ్‌ (బి) బ్రావో 29; మొయిన్‌ అలీ (సి) అండ్‌ (బి) హర్భజన్‌ 9; డివిలియర్స్‌ (సి) జడేజా (బి) హర్భజన్‌ 9; హెట్‌మయర్‌ రనౌట్‌ 0; శివమ్‌ దూబె (సి) వాట్సన్‌ (బి) తాహిర్‌ 2; గ్రాండ్‌హోమ్‌ (సి) ధోని (బి) జడేజా 4; సైని (సి) వాట్సన్‌ (బి) తాహిర్‌ 2; చాహల్‌ (సి) హర్భజన్‌ (బి) తాహిర్‌ 4; ఉమేశ్‌ (బి) జడేజా 1; సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (17.1 ఓవర్లలో ఆలౌట్‌) 70;
వికెట్ల పతనం: 1-16, 2-28, 3-38, 4-39, 5-45, 6-50, 7-53, 8-59, 9-70;
బౌలింగ్‌: చాహర్‌ 4-0-17-0; హర్భజన్‌ 4-0-20-3; రైనా 1-0-6-0; తాహిర్‌ 4-1-9-3; జడేజా 4-1-15-2; బ్రావో 0.1-0-0-1

చెన్నై ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (బి) చాహల్‌ 0; రాయుడు (బి) సిరాజ్‌ 28; రైనా (సి) దూబె (బి) మొయిన్‌ అలీ 19; జాదవ్‌ నాటౌట్‌ 13; జడేజా నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 71;
వికెట్ల పతనం: 1-8, 2-40, 3-59;
బౌలింగ్‌: చాహల్‌ 4-1-6-1; సైని 4-0-24-0; మొయిన్‌ అలీ 4-0-19-1; ఉమేశ్‌ 3-0-13-0; సిరాజ్‌ 2-1-5-1; దూబె 0.4-0-3-0.

- Advertisement -