ఐపీఎల్ 11లో భాగంగా ధోని నాయకత్వంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ నెగ్గిన సీఎస్‌కే నాలుగోసారి టైటిల్ నెగ్గేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 22 ఆటగాళ్లను మళ్లీ రీటెయిన్ చేయడానికి సిద్దమైన చెన్నై యాజమాన్యం ముగ్గురు ఆటగాళ్లను తప్పించింది.
ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్‌తో పాటు దేశవాలీ క్రికెటర్లు క్షితిజ్ శర్మ, కనిష్క్ సేత్‌లను సీఎస్‌కే వదులుకుంది. 2018 ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఒక్క మ్యాచ్‌లో ప్రాతినిథ్యం వహించిన వుడ్ వికెట్ తీయలేకపోయాడు. క్షితిజ్, సేత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో వీరిని వదులుకునేందుకు సిద్ధమైంది. గత సీజన్లో గాయపడ్డ కేదార్ జాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన డేవిడ్ విల్లేకు ఫ్రాంచైజీ మరో అవకాశమిచ్చింది.
ఐపీఎల్ 12 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని మిచెల్ స్టార్క్ స్వయంగా వెల్లడించాడు.