దీపికా-రణవీర్ ఒక్కటయ్యారు

244
deepika
- Advertisement -

బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపికా పదుకొణే-రణవీర్‌ సింగ్ ఒక్కటయ్యారు. వేద మంత్రాలు,మంగళవాద్యాలు,అతిథుల ఆశీర్వాదాల మధ్య వీరి పెళ్లి ఇటలీలోని లేక్‌ కోమోలో ఘనంగా జరిగింది. కొంకణి సంప్రదాయం ప్రకారం చిత్రపుర్ సరస్వత్ పద్దతిలో పెళ్లి జరిగింది. అతిథులందరూ తెలుపు రంగు దుస్తుల్లో మెరిశారు.

తెలుగు, బంగారు వర్ణం కలగలసిన చీరను దీపికా, కాంచీపురం షేర్వాణీని రణ్‌వీర్‌ ధరించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటలకు పెళ్లి జరిగిందని సమాచారం. గురువారం రణ్‌వీర్‌ కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘ఆనంద్‌ కరాజ్‌’ పద్ధతిలోనూ ఈ దంపతుల పెళ్లి జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు 30 మంది అతిథులను మాత్రమే హాజరయ్యారు.

deepika ranveer

- Advertisement -