తమిళనాడులో కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు వ్యవహరంపై ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి సీనీ పరిశ్రమ కూడా నిరసన వ్యక్తం చేసింది. తమిళ సూపర్ స్టార్ ఐపీఎల్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. చెన్నై ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలు ధరించాలని తలైవా అన్నారు. తమ మాట కాదని మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియంలో పాములు వదులుతామని పీఎంకే నేత వేల్ మురుగన్ హెచ్చరించడం వివాదాస్పదమైంది.
మరోవైపు రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై తొలి మ్యాచ్ కు సన్నద్దమైంది. నేడు కోల్ కత్తా నైట్ రైడర్స నే ఢీకొనబోతుంది. కావేరీ జలాల కోసం ఉద్యమం చేస్తుంటే ఐపీఎల్ మ్యాచ్ లు ఎలా నిర్విహిస్తారని ప్రజలు, నేతలు ఆందోళనలు చేపట్టారు. చిదంబరం స్టేడియం వద్ద తమిళ సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్టేడియం చుట్టు 4వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతి ఒక్కరిని క్షుణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఈ పరిస్థితులపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. నేటి మ్యాచ్ నిర్వహణ కోసం చెన్నై పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.